అమరావతి రైతుల త్యాగాలను, ఆవేదనను దశాబ్ద కాలంగా అణచివేసిన జగన్మోహన్ రెడ్డి ముఠా, ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపింది. ‘మూడు రాజధానులు’ అంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అమరావతి రైతులను, మహిళలను బూట్ల కాళ్లతో తొక్కి, లాఠీలతో తలలు పగలగొట్టిన అదే వైసీపీ నాయకత్వం, ఇప్పుడు “అమరావతి రైతుల కోసం” అంటూ మొసలి కన్నీరు కారుస్తోంది. తాజాగా వైసీపీ నాయకుడు దొంతిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశం, ఈ నాటకంలో ఎవరెవరు పాత్రధారులో స్పష్టం చేసింది. రైతుల పక్షపాతిగా ముసుగు వేసుకున్న ఈ మీటింగ్లో పాల్గొన్నది నిజమైన రైతులు కాదు. మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లుగా గతంలో వైసీపీ అధికారాన్ని అనుభవించిన వ్యక్తులు!
ఎవరీ ‘రెడ్డి’ వైసీపీ రైతు నేతలు?
ఉండవల్లి, పెనుమాక ప్రాంతాలకు చెందిన సుధాకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సురేష్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి వంటి నాయకులు ఇప్పుడు ‘రైతు’ ముసుగులో రంగంలోకి దిగారు. వీరంతా అమరావతి ఉద్యమ కాలంలో ఎటువైపు ఉన్నారో, రైతులపై జరిగిన దాడులను ఎలా సమర్థించారో ప్రజలందరికీ తెలుసు.
అమరావతి రైతుల ప్రశ్నలివే:
- అమరావతిని స్మశానంగా మార్చిన మీ నాయకుడు జగన్ కోసం దశాబ్దకాలం పాటు రైతులపై దాడులు చేయించిన మీరందరూ, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతు వేషాలు వేస్తున్నారు?
- రాజధానిని చంపేసి, భూములిచ్చిన రైతులకు కనీస గౌరవం ఇవ్వని మీరు, ఈ రాజకీయ నాటకాలతో అమరావతి రైతులను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు?
అమరావతి రైతుల రక్తంతో తడిసిన నేల మీద, వైసీపీ పాత నాయకులు కొత్త కుట్రలతో సాగిస్తున్న ఈ ‘రెడ్డి’ రైతు నాటకాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అధికారం పోయినా, ఇంకా ప్రజలను తప్పుదోవ పట్టించాలనే మీ ఆలోచనలు మీ వినాశనానికి బాటలు వేస్తున్నాయని గ్రహించండి!
