పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ప్రజలు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అవామీ యాక్షన్ కమిటీ (AAC) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ నిరసనలు మరింత ఉద్ధృతం కానున్నాయి. నిర్వాహకులు సోమవారం నుంచి ఆందోళనలను తీవ్రతరం చేయనున్నట్లు ప్రకటించారు.
✊ నిరసనకారులు మాట్లాడుతూ – పాకిస్థాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేస్తోందని ఆరోపించారు. 70 ఏళ్లకుపైగా ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని అవామీ యాక్షన్ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
📌 పీఓకేలో మౌలిక సంస్కరణలు (Structural Reforms) తక్షణం చేపట్టాలని, తమ 38 డిమాండ్లను అమలు చేయాలని కమిటీ పట్టుబడుతోంది.
🚩 ఈ మేరకు “షటర్-డౌన్ – వీల్-జామ్” పేరుతో సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రజలు పెద్ద సంఖ్యలో వీధులలోకి వచ్చి నినాదాలు చేస్తూ, పాక్ ప్రభుత్వ వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
👉 మొత్తం మీద, పీఓకే ప్రజల ఆగ్రహం పాక్ ప్రభుత్వంపై మరోసారి బహిర్గతమైంది.
