ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టు తొమ్మిదోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఈ విజయంతో టీమిండియాపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చూపిన అద్భుత ప్రదర్శనతో అభిమానులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఈ విజయం మరోసారి భారత్ క్రికెట్ ఆధిపత్యాన్ని చాటింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా జట్టు గెలుపుపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కీలక ప్రకటన చేసింది. విజేత జట్టుకు రూ.21 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి కూడా పంచనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
ఈ బహుమతి భారత జట్టుకు పెద్ద ప్రోత్సాహం కలిగించనుంది. మరోవైపు, అభిమానులు ఈ విజయాన్ని పండుగలా జరుపుకుంటూ జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నారు.
