అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకోనున్నారు. కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతల రోడ్ షో ఉండనుంది. జీఎస్టీ సంస్కరణలపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
