మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో, భారత్ ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను పునఃప్రారంభించింది. షిప్పింగ్ డేటా ప్రకారం, ‘జయ’ అనే ట్యాంకర్ ఇరాన్ ముడి చమురును తీసుకువస్తూ భారతదేశ తూర్పు తీరానికి సమీపిస్తోంది.
ఆ ట్యాంకర్ మొదట సుమారు 6 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో గుజరాత్లోని వడినార్ పోర్టుకు వెళ్తోంది. అయితే, ఆ తర్వాత అది చైనా వైపు మళ్లింది. చెల్లింపు సమస్యల కారణంగా అది భారతదేశానికి బదులుగా చైనాకు వెళ్తోందని వార్తలు వచ్చాయి. చమురు మంత్రిత్వ శాఖ ఆ వార్తలను అవాస్తవమని కొట్టివేసింది.
అయితే, ఇది ఇప్పుడు భారతదేశం వైపు మళ్ళింది. ప్రస్తుతం ఇది మలేషియా సమీపంలో ఉంది. ఈ వారం చివరి నాటికి ఇది భారతదేశ తూర్పు తీరానికి చేరుకుంటుందని అంచనా.
