మధురలోని బృందావన్లో యమునా నదిలో 30 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులతో సహా పది మంది పర్యాటకులు మునిగిపోయారు. మృతులలో భార్యాభర్తలు, తండ్రీకూతుళ్లు ఉన్నారు. పడవలో ఉన్న పర్యాటకులందరూ బాంకే బిహారీ క్లబ్ సభ్యులే. అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది
