దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలో కొనసాగుతున్న సమీక్షా సమావేశం
ఈ నెల డిసెంబరు 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు , ఇప్పటికే వైకుంఠద్వార దర్శనం టోకన్లు, టెక్కట్లను ఆన్ లైన్ ద్వారా కేటాయించిన టీటీడీ….
సామాన్యభక్తులకు పెద్దపీట వేస్తూ… ఈ సారి దాదాపు 164 గంటల పాటు వైకుంఠద్వార దర్శనం నిర్వహించనున్న టీటీడీ. మొదటి 3 రోజులు ఆన్ లైన్ ఈ-డిప్ లో టోకన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి. మిగతా 7 రోజులు ఎలాంటి టోకన్లు, టిక్కెట్లు లేని భక్తులను కూడా వైకుంఠద్వార దర్శనం కల్పించనున్న టీటీడీ, మౌలిక సదుపాయాలు, అన్నపానీయాలు వితరణ, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు సమావేశంలో పాల్గొన్న టీటీడీ, జిల్లా పరిపాలన & పోలీసు ఉన్నతాధికారులు
