పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని మస్తుంగ్ జిల్లాలోని దష్ట్ ప్రాంతంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రాక్ మీద శక్తివంతమైన పేలుడు జరిగింది. ఈ ఘటన సోమవారం (సెప్టెంబర్ 23) రాత్రి జరిగింది. పెషావర్ నుంచి క్వెట్టాకు వెళ్తున్న ఈ రైలు IED (ఇంప్రూవ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) పేలడంతో పట్టాలు తప్పింది . దీంతో నాలుగు బోగీలు ట్రాక్‌ను వదిలి పడిపోయి, 12 మంది ప్రయాణికులు (అందులో మహిళలు, పిల్లలు సహా) గాయపడ్డారు. రెస్క్యూ టీమ్‌లు స్థలానికి చేరుకుని, గాయపడినవారిని క్వెట్టా ఆసుపత్రులకు మార్చాయి. అత్యవసర చికిత్స కోసం ఎమర్జెన్సీ ప్రకటించారు.
ఘటన వివరాలు: పేలుడు ఎలా జరిగింది?
పెషావర్ నుంచి క్వెట్టాకు 270 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్, మస్తుంగ్ జిల్లా స్పెజాండ్ పట్టణం సమీపంలోని రైలు ట్రాక్ దగ్గర IED పేలడంతో పట్టాలు తప్పింది . పోలీస్, రైల్వే అధికారుల సమాచారం ప్రకారం, ట్రాక్ సమీపంలో ఉంచిన బాంబు పేలుడు కారణంగా రైలు పట్టాలు తప్పడంతో బోగీలు పక్కకు పడిపోయి, ప్రయాణికులు గాయాలు అయ్యాయని వారు మీడియాకు తెలియచేసారు . స్థానిక మీడియా రిపోర్టుల ప్రకారం, ఈ ఘటనకు కొన్ని గంటల ముందు రైలు ట్రాక్‌లు క్లియర్ చేస్తున్న పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్‌పై కూడా పేలుడు జరగడంతో , కొంతమంది మరణించినట్లు తెలుస్తుంది
