న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు సన్నాహాలు జరుగుతుండగా, దేశంలో రాజకీయ వేడి రాజుకుంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే డిమాండ్లు మరింతగా పెరుగుతున్నాయి.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), శివసేన-యూబీటీ వంటి ప్రధాన ప్రతిపక్షాలు, భారత జట్టును పాకిస్తాన్‌తో ఆడటానికి అనుమతించినందుకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఉగ్రదాడి తర్వాత కూడా దాయాది దేశంతో క్రికెట్ సంబంధాలను కొనసాగించడం దేశ భద్రతకు, అమరవీరుల త్యాగాలకు విరుద్ధమని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ మ్యాచ్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం అనుమతించిందని ప్రతిపక్షాలు దుయ్యబట్టగా, క్రీడలను రాజకీయాలతో కలపకూడదని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. అయితే, పెరుగుతున్న బహిష్కరణ పిలుపులు, ప్రతిపక్షాల తీవ్ర ఆరోపణలతో ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
