ప్రజల దృష్టి మరల్చేందుకే: మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత రాజీనామా చేయడాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కవితను కేసీఆర్ సంధించిన ‘బాణం’గా ఆయన అభివర్ణించారు.
గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కవిత చేదు నిజాలను అబద్ధాలతో కలిపి మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆమెను ఒక ‘బాణం’గా ఉపయోగించుకుంటున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
