రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కల్యాణ్ గారితో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనై జింగ్ సెక్రెటరీ జనరల్ శ్రీ మిలింద్ పరాందే సోమవారం సాయంత్రం మంగళగిరిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వి.హెచ్.పి. ప్రతినిధులు రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి, ధార్మిక ప్రచారం, సేవా కార్యక్రమాలపై చర్చించారు. ఈ యేడాది జనవరిలో విజయవాడ వేదికగా నిర్వహించిన హైందవ శంఖారావం డిక్లరేషన్ గురించి వి.హెచ్.పి. నేతలు వివరించారు. ఈ సమావేశంలో వి.హెచ్.పి. అఖిల భారత ఉపాధ్యక్షుడు శ్రీ గోకరాజు గంగరాజు, ఏపీ, తెలంగాణ క్షేత్ర కార్యదర్శి శ్రీ టి.సత్య రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఒబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి శ్రీ వి.దుర్గా ప్రసాదరాజు పాల్గొన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనై జింగ్ సెక్రెటరీ మిలింద్ పరాందే భేటీ అయ్యారు. .వి.హెచ్.పి. ప్రతినిధులు రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి, ధార్మిక ప్రచారం, సేవా కార్యక్రమాలపై చర్చించారు. ఈ యేడాది జనవరిలో విజయవాడ వేదికగా నిర్వహించిన హైందవ శంఖారావం డిక్లరేషన్ గురించి వి.హెచ్.పి. నేతలు వివరించారు. ఈ సమావేశంలో వి.హెచ్.పి. అఖిల భారత ఉపాధ్యక్షుడు శ్రీ గోకరాజు గంగరాజు పాల్గొన్నారు.
