వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి వెళ్లాలన్న తన ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ మేరకు క్వాడ్ సదస్సులో ఆయన పర్యటన రద్దైనట్లు తెలిపింది.
అమెరికా అధ్యక్షుడి షెడ్యూల్తో పరిచయం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. రాబోయే క్వాడ్ సదస్సు కోసం ట్రంప్ భారత్ సందర్శనకు వెళ్లడం లేదని ఆ పత్రిక పేర్కొంది. ఈ పర్యటన రద్దుకు గల కారణాలపై స్పష్టత లేదు.
