తిరుమల: మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత తొలిసారి బుధవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీటీడీ అధికారులు, కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.
పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న సీపీ రాధాకృష్ణన్‌కు టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళికృష్ణ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. వీరితో పాటు పలువురు ఉన్నతాధికారులు, కూటమికి చెందిన ప్రముఖ నేతలు కూడా ఆయనకు సాదర స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. శ్రీవారి దర్శనార్థం ఆయన తిరుమలకు వచ్చినట్లు తెలుస్తోంది.
