ప్రజా దర్బారులో ఎమ్మెల్యే మండలికి భాజపానేతల వినతి
హంసలదీవి పర్యాటక ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టుగా గుర్తించి పర్యాటకులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీ నేతలు ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కు అర్జీ అందజేశారు.
పాలకాయ తిప్ప కరకట్ట వద్ద టోల్ ఫీజులు వసూలు చేస్తున్నందున పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని , టోల్ ఫీజులు నిలుపుదల చేయాలని , నదీ పరివాహ ప్రాంతాల్లో మడ అడవులను సంరక్షించి నదీ పరివాహ ప్రాంతాలు కోతకు గురికాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నట్లు ఆర్జీలో పేర్కొన్నారు.
టోల్గేట్ ఫీజు అంశం ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంది అని, త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే తెలిపినట్లు భాజపా నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ తుంగల వెంకటగిరి, కోట సత్యనారాయణ, వడుగు నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేయండి
కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఇస్మాల్ బేక్పేట్ గ్రామం లో హిందూ స్మశాన వాటిక చాలా పల్లనంగా ఉండటం వల్ల వర్షం పడినప్పుడు నీరు నిలబడుతుందని గ్రామస్తులంతా కూడా చందాలు వేసుకుని రెండు లక్షల రూపాయలతో మెరక పనులు చేసామని, కానీ దహన క్రియల సమయంలో నిలబడుటకు ఎండకు వానకు షెల్టర్ఏమి లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు, ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేసి షెల్టర్ నిర్మించవలసిందిగా ప్రజా దర్బారులో కోరినట్లు గ్రామానికి చెందిన కోట సత్యనారాయణ తెలిపారు.
