మహాగౌరి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు – మూల నక్షత్ర పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీ
ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
🙏 నేడు అమ్మవారు మహాగౌరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇదే సమయంలో అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్ర పర్వదినం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
🚩 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
✨ ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలు మరింత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
