పట్నా, సెప్టెంబర్ 17, 2025: బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ లేదా నవంబర్ 2025లో జరగనున్న ఎన్నికల్లో (ఎన్డీఏ) బలమైన స్థానంలో ఉందని సర్వేలు, బైపోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ నాయకత్వంలో బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ(ఆర్వి) వంటి మిత్రపక్షాలతో ఎన్డీఏ, మహాగథ్బంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు)తో పోటీ పడుతుంది. ఎన్డీఏ లక్ష్యం 225 స్థానాలు, అయితే ప్రతిపక్షాలు యువత, నిరుద్యోగం, కుల సమీకరణలపై ఆధారపడి పోటీ చేస్తున్నాయి.
ఎన్డీఏలోని మిత్రపక్షాలు తాము పోటీ చేయబోయే స్థానాలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. బీజేపీకి ‘పెద్ద అన్న’ స్థానం, చిరాగ్ పాస్వాన్ ఫ్యాక్టర్‌తో జేడీయూ మద్దతు పెరుగుతోంది. సెప్టెంబర్ చివరిలో ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించనుందని, ఎన్డీఏ 2-3 దశల్లో ఎన్నికలు జరగాలని కోరుకుంటోంది. “ఎన్డీఏ 200 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుంది, మహాగథ్బంధన్ 40 స్థానాలకు పడిపోతుంది ” అని కేంద్ర గృహ రాజ్యమంత్రి నిత్యానంద్ రాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంక్‌ఇన్‌సైట్ అభిప్రాయ సర్వే ప్రకారం, 48.9% మంది ఎన్డీఏకు మద్దతు, 35.8% మహాగథ్బంధన్కు ఉందని తెలుస్తుంది . యదవుల్లో కూడా 32.5% మంది ఎన్డీఏకు మొగ్గు చూపుతున్నారు. 60 ఏళ్లు పైబడిన వారిలో 53% మద్దతు ఎన్డీఏకు ఉంది. ఇటీవల జరిగిన బైపోల్స్‌లో ఎన్డీఏ అన్ని 4 స్థానాలు గెలుచుకుని, ఆర్జేడీ బలమైన ప్రాంతాల్లో సైతం విజయడంకా మోగించింది . “అది సెమీఫైనల్, ఫైనల్లో సైతం ఎన్డీఏ గెలుస్తుంది” అని డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌధరీ అన్నారు.
అయితే, ప్రతిపక్షాలు ఎన్డీఏపై దాడి చేస్తున్నాయి. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల్లో పాపులర్ అవుతున్నారు . మహాగథ్బంధన్ సీటు పంపిణీపై చర్చలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ కు 70, ఆర్జేడీ 40 స్థానాలు కోరుతోంది. రాహుల్ గాంధీ ‘వోటర్ అధికార్ యాత్ర’తో వోటర్ లిస్ట్ లో ఉన్న అవకతవకలు , ఎన్డీఏపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ కూడా అన్ని (243) స్థానాల్లో పోటీ చేస్తూ, యువతను ఆకర్షిస్తోంది.
కుల సర్వే ప్రకారం, ఈబీసీలు 36% ఓటర్లు, దళితులు, యదవుల మద్దతు కీలకం. ఎన్డీఏ అభివృద్ధి పై దృష్టి పెడుతోంది, మహాగథ్బంధన్ నిరుద్యోగం, కుల సమీకరణలపై దృష్టి పెట్టారు . ఈ ఎన్నికలు బీహార్ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకుంటాయా? ఎన్డీఏ బలం కొనసాగుతుందా? త్వరలో స్పష్టత వస్తుంది.
