పీఎం కె.పి. శర్మ ఒలి దుబాయ్‌లో తాత్కాలిక ఆశ్రయం కోరుతున్నారా?
కాఠ్మాండూ, సెప్టెంబర్ 9, 2025: నేపాల్‌లో అవినీతి, సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా ‘జెన్ Z’ యువత చేపట్టిన నిరసనలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇవి హింసాత్మకంగా మారి, దేశవ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతున్నాయి . కాఠ్మాండూ, పోకరా, బిరాట్‌నగర్, భరత్పూర్, ఇటహరి, దమక్ వంటి నగరాల్లో నిరసనలు బలపడ్డాయి. పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, వాటర్ క్యానన్లు వాడటంతో కనీసం 20 మంది మరణించారు, 300 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని మోహరించి, ఆరు నగరాల్లో కర్ఫ్యూ విధించింది.ప్రధానమంత్రి కె.పి. శర్మ ఒలి ప్రభుత్వం సోమవారం రాత్రి అత్యవసర క్యాబినెట్ సమావేశంలో సోషల్ మీడియా నిషేధాన్ని ఉపసంహరించుకుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) తదితర 26 ప్లాట్‌ఫారమ్‌లపై విధించిన నిషేధం ఎత్తివేయబడింది. కానీ, నిరసకులు ఇంకా ఒలి రాజీనామా, ప్రభుత్వ విమోచనం, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు డిమాండ్ చేస్తున్నారు. “సోషల్ మీడియా నిషేధం కేవలం చిన్న సమస్య మాత్రమే .. అసలు సమస్య అవినీతి, ఆర్థిక కష్టాలు” అంటూ యువత నాయకులు చెబుతున్నారు.ఒలి ఇంటి, ప్రచాండ్ ఇంటిపై దాడులుకాఠ్మాండూ పార్లమెంట్ బయట జరిగిన ఘర్షణల్లో 17 మంది మరణించారు. ఇతర నగరాల్లో మరో ముగ్గురు చనిపోయారు . ఒలి సొంత ఊరైన దమక్లో (కోసి ప్రాంతం) నిరసకులు పీఎం ఇంటిపై రాళ్లు రువ్వారు . పోలీసులు హెచ్చరికగా గాలిలోకి కాల్పులు జరిపి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. దీంతో 10 మంది గాయపడ్డారు. మాజీ పీఎం ప్రచాండ్ ఇల్లు కూడా నిరసనకారులు దాడుల్లో దెబ్బతింది. నెపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదుర్ దేవుబా ఇంటిని నిరసకులు ఆక్రమించి, వాహనాలకు నిప్పంటించారు .హోమ్ మంత్రి రమేష్ లెఖక్ నైతిక బాధ్యత తీర్చుకుని రాజీనామా చేశారు. మరో ముగ్గురు మంత్రులు కూడా రాజీనామా ఇచ్చినట్లు నివేదికలు. ఒలి సోమవారం రాత్రి ప్రకటనలో, “నిరసనల్లో విదేశీ శక్తులు, అసాంఘిక శక్తులు చొరబడి హింసాత్మకంగా మార్చాయని . దీనిపై 15 రోజుల్లోపు పరిశోధన కమిటీ నివేదిక ఇస్తుంది” అని చెప్పారు. అయితే, రెండో రోజు మంగళవారం కూడా కర్ఫ్యూ మధ్య నిరసనలు కొనసాగాయి.
ఒలి దుబాయ్‌కు పారిపోతారా? తాత్కాలిక ఆశ్రయం కోరుతున్నారా?సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో, పీఎం కె.పి. శర్మ ఒలి దుబాయ్‌లో తాత్కాలిక ఆశ్రయం కోరుతున్నారని అనేక మీడియా రిపోర్టులు వెలుగులోకి తెచ్చాయి. ఆయన సమీప వర్గాల ప్రకారం, వైద్య చికిత్స కారణంగా దుబాయ్‌కు వెళ్లాలని ప్రణాళిక వేస్తున్నారు. ఇది ‘తఖ్తా పలట’ (కూటమి మార్పు) ముప్పుతో ముడిపడి ఉందని, ఒలి పారిపోవడంతో ప్రభుత్వం మొత్తం పడిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఒలి మంగళవారం సాయంత్రం 6 గంటలకు అన్ని పార్టీల సమావేశాన్ని పిలిచారు. “పరిస్థితిని అంచనా వేసి, శాంతి కలిగించేలా చర్చిస్తాం” అని ఒలి తెలిపారు.
అంతర్జాతీయ స్పందన: ఐక్యరాష్ట్ర సంఘం ఆందోళనఐ.ఎన్. మానవ హక్కుల విభాగం “ప్రతిష్ఠాత్మక సమూహాలపై దాడులు చేయటం ఆందోళనకరం. త్వరగా వాటిపై చర్యలు తీసుకోవాల అని ప్రతినిధి రవీనా షమ్‌దసాని చెప్పారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, యుఎస్ వంటి దేశాలు ” అసెంబ్లీ స్వేచ్ఛకు మద్దతు” తెలిపాయి. భారత్-నేపాల్ సరిహద్దులో భద్రత పెంచారు, లఖింపూర్ ఖేరీలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి .నేపాల్‌లో అవినీతి, ఆర్థిక సమస్యలు ఎక్కువ కాలం నుంచి ఉన్నాయి. 2017 ఎయిర్‌బస్ డీల్‌లో 1.47 బిలియన్ రూపాయల నష్టం జరిగినట్లు పరిశోధనలు తెలిపాయి. యువత ” ఒలి రాజీనామా డిమాండ్ పెరుగుతోంది.
