విదేశాంగ కార్యదర్శి వెల్లడి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం టియాంజిన్‌లో ఈ అత్యున్నత స్థాయి భేటీ జరుగుతుందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు.
SCO సదస్సు పూర్తయిన వెంటనే మోదీ, పుతిన్‌లు సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, వివిధ అంతర్జాతీయ అంశాలపై చర్చించే అవకాశం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. రష్యా, భారత్ మధ్య దీర్ఘకాలంగా బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఈ భేటీ ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించడానికి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మార్గం సుగమం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.
