వాషింగ్టన్, డిసెంబర్ 26: అమెరికా యునైటెడ్ స్టేట్స్, జోర్డాన్ వంటి మిత్రదేశాలతో కలిసి సిరియాలోని 70కు పైగా ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) లక్ష్యాలపై భారీ దాడులు నిర్వహించింది. ఇటీవల పాల్మైరా ప్రాంతంలో జరిగిన దాడిలో అమెరికా సైనికులు, ఇంటర్ప్రెటర్ మరణించడానికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకారం, డిసెంబర్ 19న “ఆపరేషన్ హాకీ స్ట్రైక్” పేరుతో ఈ దాడులు జరిగాయి. ఎఫ్-15, ఎ-10 వంటి ఫైటర్ జెట్లు, అపాచీ హెలికాప్టర్లు, ఆర్టిలరీతో సహా 100కు పైగా ప్రెసిషన్ మ్యూనిషన్లు ఉపయోగించారు. జోర్డాన్ ఎఫ్-16 జెట్లు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. సిరియా మధ్య ప్రాంతంలోని ఐసిస్ యోధులు, మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వలు లక్ష్యంగా చేసుకున్నారు.డిసెంబర్ 13న పాల్మైరాలో జరిగిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక సివిలియన్ ఇంటర్ప్రెటర్ మరణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను “శక్తివంతమైన ప్రతీకారం”గా అభివర్ణించారు. క్రైస్తవ సముదాయాలపై జరుగుతున్న దాడులకు ప్రతిగా ఈ చర్య తీసుకున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. నైజీరియా ప్రభుత్వంతో సమన్వయంతో ఈ దాడులు జరిగాయని, అనేక మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు అమెరికా ఆఫ్రికా కమాండ్ తెలిపింది.ఈ రెండు ఆపరేషన్లు ఐసిస్ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అమెరికా కట్టుబడినట్లు తెలుస్తోంది . సిరియా ప్రభుత్వం కూడా ఈ దాడులకు మద్దతు ప్రకటించింది.
