ఆంధ్రప్రదేశ్, నవంబర్ 18: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో సోమవారం ఉదయం భద్రతా బలగాలు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లో మావోయిస్టులతో తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మరణించగా, వారిలో సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జెడ్) ఇన్ఛార్జ్ మద్వి హిడ్మా (అలియాస్ సంతోష్) కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.మద్వి హిడ్మా పై ₹1 కోటి రివార్డు ప్రకటించగా, ఇతర మరణించిన వారిపై ₹40 లక్షల నుంచి ₹80 లక్షల వరకు రివార్డులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఎస్ఎల్ఆర్ తదితర ఆయుధాలు, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం ఆ ప్రాంతంలో గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, ఏపీ పోలీసుల బృందాలు తీవ్ర కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
